Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్
- సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- రోజురోజుకూ కొత్త కోణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్రికెట్ లింక్ కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
తొలి పరిచయం
దాదాపు 10 గంటలకు పైగా సియా సోదరుడు సాహిల్ గోయల్‌ను పోలీసులు విచారించారు. తనకు చేతన్ చౌదరి ముందే తెలుసని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు సియా తల్లిదండ్రులు మాత్రం చేతన్ గురించి తమకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. సాహిల్ తెలిపిన వివరాల ప్రకారం.. తన క్రికెట్ మ్యాచ్‌లకు సియా తరచూ వచ్చేదని.. ఆ సమయంలోనే సియాకు చేతన్ చౌదరితో పరిచయం ఏర్పడిందని వెల్లడించాడు. అనంతరం గత ఏడాది ఓ ఉమ్మడి స్నేహితుడు నిర్వహించిన దీపావళి వేడుకలో ఇద్దరూ మళ్లీ కలిశారని.. అక్కడి నుంచి వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
సాహిల్ గోయల్ పోలీసులకు మరో కీలక విషయం చెప్పినట్లు సమాచారం. తన సోదరికి పెళ్లి ఇష్టం లేకపోతే తమ కుటుంబం ఆ సంబంధాన్ని వెంటనే రద్దు చేసేదని పేర్కొన్నాడు. మరోవైపు సియా తల్లి పూజా గోయల్ కూడా.. తన కుమార్తె ఎప్పుడూ పెళ్లిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. చేతన్ చౌదరిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పింది. అయితే సియా తరఫు న్యాయవాది మాత్రం.. సియా, చేతన్ కేవలం స్నేహితులేనని వాదిస్తున్నారు.
2 వేలకుపైగా ఫోన్ కాల్స్
దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలించిన కాల్ డీటైల్ రికార్డుల (CDR) ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సియా-చేతన్ మధ్య 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు గుర్తించారు. ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు, ఇతర డిజిటల్ రికార్డులను పూర్తిగా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ డేటాను తిరిగి రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం.. కేతన్ హత్యకు ఒక రోజు ముందు అంటే జూన్ 17న సియా, చేతన్ పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలోని ఓ కేఫేలో దాదాపు గంటపాటు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమావేశంలోనే హత్యకు సంబంధించిన తుది ప్రణాళిక సిద్ధం చేశారా? లేదా ఇతర అంశాలపై చర్చించారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
కేతన్ అగర్వాల్, సియా గోయల్‌ల వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో సియా తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను లోహగడ్ కోటకు ట్రెక్కింగ్ పేరుతో తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. లోనావాలా డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మాట్లాడుతూ.. ‘‘కేతన్ హత్యలో సియా, చేతన్ ఇద్దరి పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత దిగ్భ్రాంతికరమని అభివర్ణిస్తూ.. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..