Kerala: కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురం లోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించి సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు విష్ణుజకి, ప్రభిన్ అనే వ్యక్తికి 2023లో వివాహం జరిగింది. వీరిద్దరిని పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, పెళ్లి తర్వాత నుంచి ప్రభిన్ విష్ణుజని క్రమం తప్పకుండా అవమానిస్తుండే వాడు. ఆమె అందంగా లేదని, ఉద్యోగం రాలేదని ఆమెను అవమానించేవాడని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. శారీకరంగా, మానసికంగా తీవ్ర హింసకు గురైనట్లు తెలుస్తోంది.
విష్ణుజ తండ్రి వాసుదేవన్ మాట్లాడుతూ.. తన అల్లుడు తన బిడ్డను కొట్టాడని తనకు తెలియదని చెప్పాడు. ఆమె సన్నగా ఉందని తిట్టే వాడని, చివరకు తన బైక్‌పై కూడా కూర్చోనిచ్చేవాడు కాదని చెప్పారు. పెళ్లి తర్వాత ఉద్యోగం లేదని, తన జీతంపై ఆశ పడొద్దని చెప్పేవాడని, దీంతో తన కూతురు కొన్ని పరీక్షలు రాసిందని, ఆమె చాలా ప్రయత్నించినా ఉద్యోగం ఉద్యోగం రాలేదని చెప్పారు. విష్ణుజ గతనకు వేధింపుల గురించి చెప్పలేదని, ఆమె మరణించిన తర్వాత ఆమె స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని చెప్పారు. తన బిడ్డను అతడే హత్య చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
తాము సాయం చేస్తామని చెప్పినప్పటికీ, తన సంసారంలో ఇతరుల జోక్యం అవసరం లేదని చెప్పేదని విష్ణుజ తండ్రి వెల్లడించారు. ప్రభిన్‌కి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన కుమార్తెని వేధించడంలో అతడి కుటుంబ హస్తం కూడా ఉందని అన్నారు. విష్ణుజ మరణం తర్వాత ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి స్నేహిరాలు చెప్పింది. విష్ణుజ తనతో అన్ని బాధల్ని షేర్ చేసుకునేదని ఆమె స్నేహితురాలు చెప్పింది. ఆమె తన వేధింపుల గురించి ఎవరికైనా చెబుతుందో అని, మొబైల్ ఫోన్ చెక్ చేసేవాడని వెల్లడించింది. ఆమె వాట్సాప్ నెంబర్ కూడా ప్రభిన్ ఫోన్‌తో లింక్ చేయబడిందని, ఆమె ఎప్పుడూ వాట్సాప్‌లో తమతో స్వేచ్ఛగా మాట్లాడలేదని, అతడికి తెలియకుండా టెలిగ్రామ్‌లో మాట్లాడుకునేవాళ్లమని చెప్పింది.