
కేరళలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 30 వేలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ, సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడిపోతుంది. కరోనా నుంచి బయటపడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఇటీవలే బాగా పాపులర్ అయిన ఎంజాయి ఎంజామి అనే సాంగ్ ను కరోనా మహమ్మారికి తగిన విధంగా రీమిక్స్ చేసి దానికి తగిన విధంగా పోలీసులు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్కులు పెట్టుకోవడం కాదని, దానిని ఒక అలవాటుగా మార్చుకుంటే తప్పకుండా కరోనాపై విజయం సాధించవచ్చని పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.