కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఓవైపు కోవిడ్ కట్టడికి సర్కార్ కఠిన చర్యలకు పూనుకుంటున్నా.. కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,684 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. ఒకేరోజు 41,037 మంది కోవిడ్ బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మరో 28 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10 శాతానికి తగ్గిందని.. మరణాల రేటు కూడా 0.9శాతానికి తగ్గినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
కేరళలో తగ్గిన కోవిడ్ కేసులు..
