Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన
- నిర్ణయం రేపటికి వాయిదా
- రేసులో కేసీ.వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్నితాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది. తాజాగా బుధవారం కూడా మరోసారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు చర్చించారు. కానీ సీఎం ఎంపికపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అధిష్టానం మల్లాగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై గురువారం మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
140 సభ్యులున్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా.. ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతోంది.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
తొలుత ముఖ్యమంత్రి రేసులో కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక హైకమాండ్ టెన్షన్ పడుతోంది. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేపు అయినా నిర్ణయిస్తుందా? లేదంటే పొడిగిస్తుందా? అన్నది చూడాలి.
#WATCH | Delhi: Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "As authorised by the members of the CLP in Kerala, the high command of Congress has completed all discussions. The decision on who the next CM of Kerala will be announced tomorrow." pic.twitter.com/A5PmNOn9dD
— ANI (@ANI) May 13, 2026
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?