Onam: కేరళ రాష్ట్రంలో ప్రముఖ పండగ ఓనం. ఓనం పండగ రోజు అక్కడి ప్రజలు తెగతాగారు. ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రానికి కొన్ని రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో మద్యంపై ఆదాయం వచ్చింది. ఎంతలా అంటే మందుబాబుల తాగుడు చంద్రయాన్-3 బడ్జెన్‌ని కూడా మించి పోయింది. నిధుల కొరతతో అల్లాడుతున్న కేరళ ప్రభుత్వానికి ఓనం పండగ ఉపశమనాన్ని ఇచ్చింది.
ఓనం పండగ రోజుల్లో ఏకంగా రూ. 759 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. చంద్రయాన్-3 బడ్జెట్ రూ. 600 కోట్లను మించి డబ్బులు వసూలయ్యాయి. సగటున రూ. 159కి తగ్గకుండా రాష్ట్రవాసులు మద్యాన్ని కొనుగోలు చేశారు. కేరళ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్(బెవ్‌కో) 10 రోజుల వ్యవధిలో రికార్డు అమ్మకాలను చూసింది. గతేడాది పండగ సీజన్ తో పోల్చి చూస్తే 8.5 శాతం సేల్స్ పెరిగాయి. ఓనం పండగ ఉత్రాదం రోజున రూ. 116 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి.
Read Also: Bigg Boss 7: రెమ్యునరేషన్ ఇష్యూ.. చివరి నిముషంలో టీంకి హ్యాండ్ ఇచ్చిన నటి?
కేరళకు చెందిన ప్రముఖ రమ్ బ్రాండ్ ‘జవాన్’ 10 రోజుల్లో 70,000 కేసులు అమ్ముడయ్యాయి. తిరుర్, మలప్పురంలలో ఎక్కువ విక్రయాలు నమోదయ్యాయి. త్రిసూర్ జిల్లా ఇరింజలకుండ రెండోస్థానంలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్న సమయంలో ఓనం పండగ రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వచ్చింది.
