NTV Telugu Site icon

Delhi: ఎల్జీ వీకే.సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ.. రాజీనామా లేఖ అందజేత

Delhinewcmatishi

Delhinewcmatishi

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్‌.. వీకే.సక్సేనాకు అందజేశారు. అంతేకాకుండా తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకున్న పత్రాన్ని ఎల్జీకి అందజేశారు. ప్రమాణస్వీకారానికి సక్సేనా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో మంత్రి అతిషిని తదుపరి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్ జైలుకెళ్లిన దగ్గర నుంచి ఢిల్లీ పాలనను ఆమెనే చూసుకుంది. దీంతో ఆమె వైపే కేజ్రీవాల్ మొగ్గుచూశారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమె ఆధ్వర్యంలో ఎన్నికల్లోకి దిగనున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త పొలిటికల్‌గా పెను సంచలనం సృష్టించింది. అన్న మాట ప్రకారం రాజీనామా చేయడం.. తదుపరి సీఎంగా అతిషికి అవకాశం కల్పించడం చకచకగా జరిగిపోయాయి.

Show comments