Site icon NTV Telugu

Kashmir: కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. విమాన సర్వీసులు రద్దు

Kashmir1

Kashmir1

జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ను మంచు దుప్పటి కుప్పేసింది. రెండు రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు.. ఎయిర్‌పోర్టులను హిమపాతం కప్పేసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమాన సర్వీసులు శ్రీనగర్‌లో నిలిచిపోయాయి. ఇక రాంబన్‌, చందర్‌కోట్‌లో ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ హిమపాతం కురవడంతో దోడాలోని భలేసా ప్రాంతం నిర్మలమైన అందాన్ని సంతరించుకుంది. అలాగే రాజౌరీ జిల్లాలోని పిర్ పంజాల్ ప్రాంతంలో భారీ హిమపాతం కప్పేసింది. దీంతో పలు రహదారులు మూసేశారు.

ఇది కూడా చదవండి: UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!

ఇక హిమాచల్ ప్రదేశ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. మనాలిలో కురిసిన భారీ హిమపాతం కారణంగా వాహనాలు, ఇళ్లు మంచు దుప్పటితో కప్పబడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: India Breaks Pakistan Record: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!

శ్రీనగర్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక నివేదికల ప్రకారం.. మంచు కారణంగా రన్‌వేలు నిరుపయోగంగా మారడంతో 20కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ప్రస్తుతం కార్మికులు రన్‌వేను కార్మికులు క్లియర్ చేస్తున్నారు. విమానాలు రద్దు కావడంతో విమాన సంస్థలు నగదు రీఫండ్ చేయనుంది.

Exit mobile version