Neha murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహ హిరేమత్ హత్య కేసులు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫయాజ్ అనే నిందితుడు అత్యంత ఘోరంగా కాలేజ్ క్యాంపస్‌లో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ఇది ‘లవ్ జిహాద్’ అని బీజేపీ ఆరోపిస్తూ, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇది వ్యక్తిగత విషయాల్లో జరిగిన హత్యగా అభివర్ణించింది. దీంట్లో లవ్ జిహాద్ కోణం లేదని కర్ణాటక హోం మినిష్టర్ పరమేశ్వర చెప్పారు.
Read Also: America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
ఇదిలా ఉంటే, ఈ హత్య కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, భయాందోళనకు గురైన హుబ్బళ్లికి చెందిన ఓ యువతి, తన స్నేహితుడు అఫ్తాబ్‌తో స్నేహానికి స్వస్తి చెప్పింది. అఫ్తాబ్ ఇచ్చిన గిఫ్టులను తిరిగి ఇచ్చేందుకు అఫ్తాబ్ ఇంటికి కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో అతను ఆమెను తిడుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేశ్వరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పండ్ల వ్యాపారి అయిన అఫ్తాబ్, సదరు మహిళ స్నేహితులని పోలీసులు చెప్పారు. నేహా హిరేమత్ హత్యతో అతడితో స్నేహాన్ని సదరు యువతి ముగించాలని అనుకుంది.
మహిళ అఫ్తాబ్‌ని కలవడానికి వెళ్లగా, అతను ఆమె ఇచ్చిన గిఫ్టులను తగలబెట్టాడు, ఆమెను తిట్టడంతో పాటు చెంపపై కొట్టాడు. అయితే, దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను రక్షించాడు. అఫ్తాబ్ రెండేళ్లుగా తన వెంటపడి వేధిస్తున్నాడని, తనకు బ్యాగులు, ఇతర వస్తువుల్ని గిఫ్టులుగా ఇచ్చేవాడని అయితే, నేహ హత్య తర్వాత అఫ్తాబ్ ఉద్దేశాలపై తనకు అనుమానం వచ్చిందని, తమ మధ్య ఉన్న స్నేహాన్ని ముగించాలని చెప్పినట్లు మహిళ చెప్పింది. అది పబ్లిక్ ప్లేస్ కావడంతో సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. తన తలపై బరువైన వస్తువుతో కొట్టినట్లు తెలిపింది. సదరు అఫ్తాబ్‌ని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేహలాగా మరో సోదరిని కోల్పోలేము అని ఆమెను రక్షించిన బాటసారి అన్నారు. అదే సమయంలో హిందూ సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు మహిళని రక్షించడానికి అఫ్తాబ్‌ని కొట్టారు. మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసశారు.