Site icon NTV Telugu

Karnataka: మసీదులో దసరా పూజ చేసే ప్రయత్నం.. 9 మందిపై కేసు

Karnataka

Karnataka

Mob enters mosque grounds to perform puja on Dussehra: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా ఓ వర్గం ప్రజలు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దసరా సందర్భంగా అక్కడ పూజ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీదర్ మహమూద్ గేవాన్ మదర్సా, మసీదు మైదానాల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.

అక్టోబర్ 6న దసరా సందర్భంగా ఓ గుంపు మసీదు మైదానంలోకి ప్రవేశించి దసరా పూజ నిర్వహించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మసీదు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారసత్వం ప్రదేశంతా పరిరక్షించబడుతోంది. ఈ ఘటనపై మరో వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. లోపలకి ప్రవేశించిన కొంత మంది వ్యక్తలు నినాదాలు చేస్తూ వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also: Mrunal Thakur: వేశ్యా గృహంలో రెండు వారాలు నరకం చూశాను.. సీత షాకింగ్ కామెంట్స్

‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ గేటు బద్ధలు కొట్టేందుకు జనం ప్రయత్నించారని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ వ్యక్తిని బెదిరించి, మసీదు గోడపై చెత్తను పడేసినట్లు ఆరోపిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే శుక్రవారం తమ నిరసన, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.

కాగా.. నిజాం కాలం నుంచి దసరా సందర్భంగా ఈ మసీదులో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మసీదు లోపల సాధారణంగా 2-4 మంది సందర్శించి.. పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎక్కువ సంఖ్యలో మంది రావడంతో వివాదం ఏర్పడిందని జిల్లా ఎస్పీ కిషోర్ బాబు అన్నారు. కొన్నేళ్లుగా హిందువులు మసీదులోకి వెళ్లి చెట్టుకు పూజలు చేస్తున్నారు. హిందువులు ఈ మసీదులోకి వెల్లడం కొత్త కాదని.. అయితే ఈ సారి వివాదం ఏర్పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

Exit mobile version