Site icon NTV Telugu

KS Eshwarappa: సీఎం ఆదేశాలు.. ఇవాళ ఆ మంత్రి రాజీనామా..

Ks Eshwarappa

Ks Eshwarappa

ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య వ్యవహారం ఆ మంత్రి మెడకు చుట్టుకుంది… ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌.. సూసైడ్‌ నోట్‌లో ఏకంగా మంత్రి పేరు పేర్కొన్నాడు.. తనకు రావాల్సిన బిల్లులో 40 శాతం కమిషన్‌ అడిగారనే ఆరోపణలు మంత్రిపై వచ్చాయి.. విపక్షాలు ఆందోళనకు దిగాయి.. దీంతో.. ఎకట్టేలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప… ఎట్టకేలకు రాజీనామా ప్రకటన చేశారు. ఇవాళ రాజీనామా లేఖను సీఎం బసవరాజ్‌ బొమ్మైకి అంద చేస్తానని గురువారం వెల్లడించారు ఈశ్వరప్ప.. శివమొగ్గలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక ప్రభుత్వంలో నేను గ్రామీణ అభివృద్ధి-పంచాయత్‌ రాజ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.. నా మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను.. శుక్రవారం రోజు రాజీనామా లేఖను సీఎంకు అందజేస్తానని వెల్లడించారు.

Read Also: Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ వార్నింగ్‌.. ఇక ప్రమాదకరంగా మారుతా..!

కాగా, బెల్గాంకు చెందిన సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఉడుపిలోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.. అయితే, తన మరణానికి మంత్రి ఈశ్వరప్ప మాత్రమే బాధ్యులని సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది.. రూ. 2 కోట్ల బిల్లుల చెల్లింపునకు 40 శాతం కమిషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.. మరోవైపు.. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో మంత్రిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది.. ఈశ్వరప్పను పదవి నుండి తొలగించాలంటూ కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.. సీఎం బసవరాజు బొమ్మై నివాసానికి ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధం అయ్యారు.. రణదీప్‌ సూర్జేవాలా, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. మొత్తంగా ఈశ్వరప్ప వ్యవహారం రచ్చగా మారడంతో.. చివరకు రాజీనామాకు దారితీసింది.

Exit mobile version