Karnataka Minister Sriramulu: నేను కాపీ కొట్టి పదో తరగతి పాసయ్యా.. 14 సార్లు జైలుకెళ్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Minister B Sriramulu Says He Passed 10 Exams By Cheating: కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకునే రోజుల్లో తనకు కాపీ కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉందని, తాను కాపీ కొట్టే పదో తరగతి పాసయ్యానని కుండబద్దలు కొట్టారు. బళ్లారి జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘చదువుకునే రోజుల్లో నేను ట్యూషన్లో ప్రతిరోజూ అవమానానికి గురయ్యేవాడ్ని. టీచర్లు నన్ను అందరి ముందు తిట్టేవారు. నన్ను ఒక వెర్రివాడిలాగా చూసేవారు. కానీ.. ఎప్పుడైతే నేను పదో తరగతి పాసయ్యానో, అప్పుడు నా టీచర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు నేను కాపీ కొట్టి పదో తరగతి పాసయ్యానని టీచర్‌కి చెప్పాను. అంతేకాదు.. చీటింగ్ చేయడంలో నేను ఛాంపియన్ని అని, అందులో తాను పీహెచ్డీ చేశానని టీచర్‌కి చెప్పా’’ అంటూ మంత్రి పేర్కొన్నారు.
Bhupendrabhai Patel: నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
స్కూల్లో తాను ఉత్తీర్ణుడ్ని కానని, ఎందరో టీచర్లు తనని ఎడ్యుకేట్ చేసేందుకు ప్రయత్నించారని శ్రీరాములు అన్నారు. కానీ.. ఎందుకో తాను సరిగ్గా చదువుకోలేకపోయానని చెప్పారు. నాకు చదువు రాదని ఎందరో తనని హేళన చేశారని పేర్కొన్నారు. కాలేజీ రోజుల్లో తాను కన్నడ సహా ఏ భాషలోనూ సరిగ్గా మాట్లాలేనంటూ టీచర్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. తాను 14 సార్లు జైలుకు కూడా వెళ్లానని బాంబ్ పేల్చారు. తాను పేదవాళ్లను కాపాడేందుకు, వారికి న్యాయం చేసేందుకు రౌడీగా కూడా వ్యవహరించానన్నారు. టీచర్లనే ర్యాగింగ్ చేశానన్నారు. తాను ఎప్పుడైతే జీన్స్ వేస్తానో, అప్పుడు కాలేజీలోని అమ్మాయిలందరూ తనవైపే చూసేవారని వెల్లడించారు. ఇలా ఈ విధంగా ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడంతో.. అది వివాదాస్పదం అయ్యింది. మంత్రి హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలా చేసేది? విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు? అంటూ శ్రీరాములుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Fight In Marriage: పెళ్లిలో వింత ఘటన.. ఫోటోల కోసం దబిడిదిబిడి
తాజావార్తలు
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!