Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్.. టీకా వేసుకుంటేనే సినిమా హాల్‌లోకి ఎంట్రీ..

ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్‌ అధికారి మంజునాథ్‌ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో సమాలోచనలు చేశారు.. ఆ తర్వాత ప్రభుత్వం మార్గవర్శకాలు విడుదల చేసింది.

ఇక, ఆరోగ్యసౌధ నుంచి 21 మెడికల్‌ కళాశాల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడారు సీఎం బొమ్మై… రాష్ట్రంలో రెండు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో.. కేసులు పెరిగితే పీజీ విద్యార్థులను వైద్య సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆస్పత్రుల్లో సిబ్బంది సంఖ్య పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్నారు.. పారామెడికల్‌ కోర్సు చదివే 18 వేల మంది సేవలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఐసీయూ ఏర్పాట్లు, పరికరాల కొనుగోళ్లపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. ఇక, మార్గదర్శకాల్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. జనాలు ఎక్కువగా గుమ్మిగూడే అవకాశం ఉన్న చోట్ల కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నారు. సినిమా హాల్, మాల్స్‌కు వెళ్లేందుకు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసింది సర్కార్.. తల్లిదండ్రులు రెండు డోస్‌ల టీకాలు తీసుకుంటునే వారి పిల్లలను పాఠశాలల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.. పాఠశాల, కాలేజీల్లో సభలు, సమావేశాలకు ఇక అనుమతి ఉండదని పేర్కొన్న ప్రభుత్వం.. వివాహాది కార్యాలకు 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది.

Exit mobile version