NTV Telugu Site icon

Nirmala sitharaman: ఎలక్టోరల్ బాండ్ల కేసులో నిర్మలమ్మకు ఊరట.. విచారణపై స్టే

Nirmalasitharaman

Nirmalasitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. బెంగళూరులో నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొద్ది రోజులకే ఉపశమనం లభించింది. పోల్ బాండ్ల కేసులో నిర్మలా సీతారామన్‌పై విచారణకు కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. నిర్మలా సీతారామన్, ఇతర బీజేపీ అగ్ర నేతలపై తదుపరి విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం నిలిపివేసింది. తనను నిందితుడిగా చేర్చిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 22న జరగనుంది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఇది కూడా చదవండి:Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్‌పీ) నేత ఆదర్శ ఆర్‌.అయ్యర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మలా సీతారామన్, తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. తిలక్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్‌ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.

ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఎలక్టోరల్ బాండ్లను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ పథకాన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగం ప్రకారం సమాచార హక్కు మరియు వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Kolikapudi Srinivasa Rao: తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంలో మరో ట్విస్ట్..