Site icon NTV Telugu

Karnataka High Court: పెళ్లి చేసుకున్న తర్వాత అత్యాచారం, పోక్సో కేసులు కొట్టివేసిన కోర్ట్

Karnataka High Court

Karnataka High Court

Karnataka High Court Cancels POCSO, Rape Charges After Victim And Accused Marry: బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం( పోక్సో), అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల యువకుడిపై ఈ కేసులను కొట్టి వేసింది కర్ణాటక హైకోర్టు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు. కేసు కోర్టులో ఉండగానే ఈ జంట బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఈ కేసులో బాధితురాలు, నిందితుడు పరస్పరం కాంప్రమైజ్ కు రావడంతో యువకుడిపై ఉన్న కేసులను రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు.

బాధిత యువతి, నిందితుడు ఇద్దరు సెక్షన్ 320 రెడ్ విత్ 480 సీఆర్పీసీ ప్రకారం కాంప్రమైజ్ పిటిషన్ దాఖలు చేయడంతో యువకుడిపై ఉన్న పోక్సో, అత్యాచార కేసులను రద్దు చేసింది కోర్టు. ఇదే సమయంలో పిటిషనర్ పై ఉన్న నేరాన్ని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదని కర్ణాటక హైకోర్ట్ పేర్కొంది. ప్రాసిక్యూషన్ వ్యతిరేకతను పట్టించుకోకుండా.. ఇరు పక్షాలు సెటిల్మెంట్ ను అంగీకరించడంతో విచారణను ముగించడం మంచిదని హైకోర్టు పేర్కొంది. బిడ్డను పెంచే జంటకు కోర్టు తలుపులు మూసేస్తే..మొత్తం విచారణ న్యాయ విరుద్ధానికి దారి తీస్తుందని.. జస్టిస్ ఎం నాగప్రసన్న తన తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలు, నిందితుడు పెళ్లి చేసుకున్న తరువాత న్యాయస్థానాలు నిందితుడిపై ఉన్న విచారణను ముగించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

Read Also: VijayaShanthi: మేము తిరగబడితే మీరు తట్టుకోలేరు.. అవినీతిలో లిమిట్ దాటారు..

ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే.. తన మైనర్ కూతురు కనిపించడం లేదని.. బాధితురాలి తండ్రి మార్చి 2019లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్ విచారణలో యువకుడి వద్ద బాధితురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరూ కూడా పరస్పర ఇష్టంతోనే కలిసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే బాలిక వయసు 17 ఏళ్లే కావడంతో పోలీసులు సదరు యువకుడిపై పోక్సో, అత్యాచారం కేసులు పెట్టారు. దీంతో 18 నెలల పాలు జైలులో ఉన్న సదరు యువకుడికి బెయిల్ మంజూరు అయింది. 2020లో యువతికి 18 ఏళ్లు నిండిన తర్వాత 2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓ సంవత్సరం తరువాత ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Exit mobile version