Site icon NTV Telugu

Karnataka: సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలలో లైంగిక విద్య ప్రవేశపెట్టాలని నిర్ణయం

Sexeducation

Sexeducation

కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు. కౌమారదశలో శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి టీనేజర్లకు అవగాహన కల్పించడం అవసరం అని తెలిపారు. వారానికి రెండు సార్లు వైద్య నిపుణులతో క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఆరోగ్యం, భద్రత విద్యలో ఒక భాగమని మంత్రి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విద్యను ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవే
వారానికి రెండు సార్లు వైద్య నిపుణులు క్లాసులు నిర్వహిస్తారు.
ఇక ఏడాదికి రెండు సార్లు చెకప్‌లు, కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
పరిశుభ్రత, అంటు వ్యాధులు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పిస్తారు.

పోలీసుల అవగాహన
అలాగే భద్రతపై కూడా పోలీసు అధికారుల చేత క్లాసులు నిర్వహించనున్నారు. లైంగిక చర్యలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే పోక్స్ చట్టాన్ని కూడా వివరిస్తారు. చట్టపరమైన రక్షణ గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించనున్నారు.

Exit mobile version