Site icon NTV Telugu

మాజీ సీఎం ఇంట్లో విషాదం… మనవరాలు ఆత్మహత్య

కర్ణాకట మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య నీరజ్ (30) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు వసంతనగర్‌లోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న సౌందర్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. మాజీ సీఎం యడ్యూరప్ప పెద్ద కుమార్తె పద్మజ కూతురు సౌందర్య ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.

Read Also: ఏడీఆర్ రిపోర్ట్: ఆస్తుల్లో టీఆర్ఎస్.. అప్పుల్లో టీడీపీ టాప్

అయితే సౌందర్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2019లో డాక్టర్ నీరజ్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా… ఎంతసేపటికీ తలుపులు తెరుచుకోలేదు. దీంతో పనిమనిషికి అనుమానం వచ్చి వెంటనే నీరజ్‌కు ఫోన్ చేసింది. హుటాహుటిన నీరజ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తలుపులను తెరిచి లోపలకు వెళ్లగా సీలింగ్ ఫ్యాన్‌కు సౌందర్య వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి సౌందర్యది ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా సౌందర్య తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలుస్తోంది.

Exit mobile version