NTV Telugu Site icon

Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Karnataka (2)

Karnataka (2)

కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది.. సోమవారం తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లాలో ని జాతీయ రహదారి-150పై కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కెకెఆర్‌టిసి) మరియు ట్రక్కు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా వ్యక్తులు మరణించారు.. మృతులను మాబమ్మ (35), రమేష్ (40), పార్వతమ్మ (45), నరసప్ప (5), రవి (23)గా గుర్తించారు. వీరంతా రాయచూరు జిల్లా వాసులు. మరో ఆరుగురికి గాయాలై చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గొల్లహళ్లి సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేకేఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి అదుపు తప్పి దాన్ని ఢీకొట్టింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు..

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, అలోక్ కుమార్ ఈ ప్రమాదం గురించి వివరించారు.. ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.. చిత్రదుర్గ జిల్లాలో ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న KSRTC బస్సు లారీని తప్పుగా ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది, ఫలితంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒక మనిషి చేసిన విపత్తు.. డ్రైవర్ అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘోర ప్రమాదం తో జనాలు ఉలిక్కి పడ్డారు.. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ ఇక్కడే జరిగాయని, ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని వాహనాదారులకు పోలీసులు సూచిస్తున్నారు..