దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కరోనా కేసుతు, ఉధృతి తదితర విషయాలపై కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులను, తీవ్రతను పరిశీలించిన కమిటీ కీలక సూచనలు చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, థర్డ్‌వేవ్ ప్రభావం పొంచిఉన్న దృష్ట్యా పాజిటివిటి 2శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై దృష్టిసారించాలని సూచించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వాణిజ్యసముదాయాలకు అనుమతులు ఇవ్వాలని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తప్పని సరిగా నైట్ కర్ఫ్యూ విధించాలని కమిటీ సూచించింది. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెండు డోసులు వ్యాక్సిన్‌లు తీసుకున్నా రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు ఉండితీరాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీచేసింది.
మూడో వేవ్‌పై టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక సూచన: పాజిటివిటి 2శాతం దాటితే…
