కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడారు. రెండేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నారు. పార్టీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాసేపట్టో ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన గవర్నర్‌ను కలిసి రాజీనామాను అందజేస్తారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అయితే అప్పట్లో యడ్యూరప్ప ఈ వార్తలను ఖండించారు. అదిష్టానం తనకు హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, 75 ఏళ్లు దాటిన వ్యక్తులు అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటం పార్టీ నియమావళికి విరుద్ధం కావడంతో దానికి కట్టుబడి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చినట్టు నేతలు చెబుతున్నారు. యడ్యూరప్ప తరువాత ఎవరు కర్నాటక ముఖ్యమంత్రి అవుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
కర్నాటక సీఎం రాజీనామా…
