Site icon NTV Telugu

BJP Praveen Kammar: బీజేపీ యువ నేత దారుణ హత్య.. అదుపులోకి నిందితులు

Bjp Youth Leader Killed

Bjp Youth Leader Killed

Karnataka BJP Youth Wing Leader Praveen Kammar Killed: కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్‌ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో ఓ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమాం కొనసాగుతుండగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణను ఆపేందుకు ప్రవీణ్ ప్రయత్నించగా.. ప్రత్యర్థి వర్గం అతడ్ని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాలపాలవ్వడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వారు తాగిన మత్తులో ఉన్నారని.. మొత్తం నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Physical Harassment: బాలుడిపై అత్యాచార యత్నం.. హతమార్చిన మైనర్

అయితే.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్ని.. ఈ దారుణ హత్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ‘‘తీవ్ర వేదనతో ప్రవీణ్ కమ్మార్ హత్యకు గురయ్యారనే వార్త మీతో పంచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ప్రవీణ్‌ను మంగళవారం రాత్రి దారుణంగా హతమార్చారు. నేరస్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా తేజస్వీ స్పందించారు. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ధార్వాడ్ జిల్లాలో హత్య జరగడం ఖండించదగినదని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రార్థించాలన్నారు. అటు.. పోలీసులు మాత్రం ఇది రాజకీయ హత్య కాదని, ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో జరిగిన హత్యేనని స్పష్టం చేశారు.

Lord Of The Drinks: లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రియాంక్ సుఖిజా

ఇదిలావుండగా.. గతేడాది జులై 26న బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారును అతని బ్రాయిలర్ దుకాణం ముందే గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. ఈ హత్య దక్షిణ కన్నడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో గతేడాది కూడా పుత్తర్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించారు. ఈ నేరానికి సంబంధించి కర్ణాటక పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. అప్పుడు ఈ అరెస్టులపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Exit mobile version