NTV Telugu Site icon

Karnataka: పరీక్షల సమయంలో తలను కప్పే దుస్తులపై బ్యాన్, మంగళసూత్రానికి అనుమతి..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ(కేఈఏ) రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థుల డ్రెస్ కోడ్‌లో కీలక మార్పులు చేసింది. తను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని చెప్పింది. పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ఉద్యోగ నియామక బోర్డులు, కార్పొరేషన్ నియమాక పరీక్షల్లో తలను కప్పి ఉంచే అన్ని రకాల దస్తులను నిషేధించింది.

Read Also: 800 Movie : ఓటీటీ లోకి రాబోతున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’..

ఇదిలా ఉంటే ఎగ్జామ్ సమయంలో హిందూ అభ్యర్థులకు సంబంధించి, ముఖ్యంగా పెళ్లైన స్త్రీల మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, ఉంగరాలను గతంలో అనుమతించేవారు కాదు. అయితే రైట్ వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో తాజాగా వీటిని పరీక్షా సంఘం అనుమతించింది.

గతేడాది నుంచి కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ నిరసనలు జరిగాయి. అయితే తాజాగా పేర్కొన్న మార్గదర్శకాల్లో హిజాబ్ గురించి నేరుగా పేర్కొనకపోయినప్పటికీ.. తల, చెవులను కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం విధించడంతో, హిబాబ్‌పై కూడా నిషేధం విధించినట్లు అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.