Site icon NTV Telugu

PM Modi: శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం

Modi

Modi

ప్రధాని మోడీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించనున్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని లడఖ్‌లో పర్యటించనున్నారు. కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించనున్నారు. అనంతరం షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Tata Curvv EV: అదిరిపోయిన టాటా కర్వ్ EV ఇంటీరియర్, ఫీచర్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?

షింకున్ లా టన్నెల్ 16,580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భారీ పర్వత మార్గమైన షింకున్-లా పాస్ కిందకు వెళ్లే మోటరబుల్ సొరంగం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ వ్యాలీని లడఖ్‌లోని జంస్కర్ వ్యాలీని కలుపుతుంది. సొరంగం పొడవు దాదాపు 4.1 కిలోమీటర్లు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Nirmala Sitharaman : ‘కుర్చీ సేవ్’ బడ్జెట్ ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి..

Exit mobile version