NTV Telugu Site icon

Delhi: ప్రధాని మోడీని కలిసిన కపూర్ కుటుంబం.. దేనికోసమంటే..!

Ranbirkapooraliabhatt

Ranbirkapooraliabhatt

ఢిల్లీలో ప్రధాని మోడీని బాలీవుడ్‌కు చెందిన కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్, కరిష్మా కపూర్‌లతో సహా కపూర్ కుటుంబ సభ్యులంతా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వారిలో ఉన్నారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ రాజ్ కపూర్ 100 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు. సంప్రదాయ దుస్తుల్లో నటులు మెరిసిపోయారు.

ప్రఖ్యాత చిత్రనిర్మాత రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవలను గుర్తుచేసుకునేందుకు ఈ శతాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ఉత్సవంలో అభిమానుల కోసం రాజ్ కపూర్‌కు చెందిన 10 దిగ్గజ చిత్రాలను 40 నగరాల్లో ప్రదర్శించనున్నారు. 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 13–15, 2024 నుంచి 40 నగరాలు, 135 సినిమా థియేటర్‌లో ప్రదర్శింపబడనున్నాయి.