Site icon NTV Telugu

Uttar Pradesh: సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను చితకబాదిన కన్వారియాలు..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Mahindra Thar: బెంజ్‌ కార్‌ను రక్షించిన మహీంద్రా థార్.. ఒకసారి ఈ వైరల్ వీడియో చూడండి..

సీసీటీవీలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. కాషాయ దుస్తులు ధరించిన కొందరు కన్వారియాలు మీర్జాపూర్ స్టేషన్‌లో బ్రహ్మపుత్ర రైలును ఎక్కే ముందు సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కొట్టడం కనిపిస్తోంది. ఈ సంఘటనపై రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు కన్వారియాలను అరెస్ట్ చేసింది.

శివ భక్తులు ప్రతీ ఏడాది తీర్థయాత్ర అయిన కన్వారియా యాత్రలో పాల్గొంటారు. ఇందులో వారు చెప్పులు లేకుండా నడుస్తూ, పవిత్ర గంగా జలాన్ని కండల్లో ఆలయాలకు తీసుకెళ్లుతారు. కన్వర్ యాత్ర జూలై 11న ప్రారంభమై జూలై 23న ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారు కాషాయ దస్తులు ధరించి, శివ నామ స్మరణ చేస్తూ యాత్ర చేస్తారు. గంగా జలాలను శివాలయాలకు తీసుకెళ్లి, శివలింగాలకు అభిషేకం చేస్తారు.

Exit mobile version