Bride With Boyfriend: ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఓ వధువు చేసిన పని సినిమాను తలపించింది. అచ్చం సినిమా స్టైల్ లో అందరిని నమ్మించి ప్లాన్ వేసుకుని బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయిన ఘటన కుటుంబ సభ్యులనే కాదు వరుడు కూడా మండపంలో సైలెంట్ గా కూర్చునే విధంగా చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.
వధువు కుటుంబం 25 ఏళ్లుగా లక్నోలో నివసిస్తోంది. అక్కడ.. ఆ మహిళ ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆ విషయం.. ఆమె ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. అయితే వీరి బంధానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ కులానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఆమెను స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చౌబేపూర్ గ్రామంకు తీసుకెళ్లారు. అయితే ఆ మహిళ అక్కడ తన ప్రియుడితో టచ్‌లో ఉంది. పెళ్లికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో.. పెళ్లి రోజే బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రియుడు ఆమెను బ్యూటీపార్లర్ నుంచి పికప్ చేయడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో భయపడిన వధువు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో వరుడి బృందం.. కళ్యాణ మండపానికి వెళ్లింది.
వధువు కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆందోళన కనిపించింది. వధువు ఆచూకీ గురించి ఆరా తీస్తే.. బ్యూటీపార్లర్‌కు వెళ్లి ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని వరుడి కుటుంబీకులను వధువు బంధువులకు తెలిపారు. ఈ వ్యవహారంపై వరుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం సరికాదని, ఇప్పుడు తమ పరువు పోయిందని వాపోయారు. చేసేదేమీ లేక.. వరుడి కుటుంబీకులు.. కళ్యాణమండపం వదిలి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయంపై వధువు కుటుంబ సభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తమ బిడ్డ ఇంత పని చేస్తుందని ఊహించలేదని విలపిస్తున్నారు. అసలు తన కూతురు ఎక్కడికి వెళ్లిపోయిందోనని భయంగా ఉందని అంటున్నారు. వధువు కోసం ఆమె కుటుంబ సభ్యులు వెతికి విఫలమయ్యారు. చివరికి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వధువు, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
SK23 : మరో ప్రయోగాత్మక చిత్రం చేయనున్న శివకార్తికేయన్.. డైరెక్టర్ ఎవరంటే..?