Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనా మనసులో మాట.. లోక్ సభకు పోటీపై క్లారిటీ

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut’s key comments on contesting the Lok Sabha elections: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె రాజకీయాల గురించి మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేషనల్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.

రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?అని ప్రశ్నించిన సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆమె అన్నారు. నేను చెప్పినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నాకు సేవ చేయడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతూ.. ‘‘ మహాపురుష్’’ అని పొగిడారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ పోటీదారుడు కావడం విచారకరమని .. మోదీకి ప్రత్యర్థులు లేరని అన్నారు.

Read Also: MLAs Resignation: ఇదేం గోలరా నాయనా.. ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు వాగ్ధానాలకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు పడబోరని అన్నారు. హిమాచల్ ప్రజలకు సొంతంగా సోలార్ విద్యుత్ ఉందని.. ప్రజలు సొంతగా కూరగాయలు పండించుకుంటున్నారని కంగనా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ ఉచితాలు పనికి రావని అన్నారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ‘‘ఎమర్జెన్సీ’’ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఆమె కనిపించబోతోంది. అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజస్, టింక్ వెడ్స్ షేరూ సినిమాల్లో నటిస్తోంది కంగనా.

Exit mobile version