Emergency: కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘‘అత్యవసర పరిస్థితి’’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా, ఇందిరా గాంధీ పాత్రని పోషించింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని బంగ్లాదేశ్ నిషేధించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ఎమర్జెన్సీని బంగ్లా నిషేధించింది.
‘‘బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని నిషేధించాలనే నిర్ణయం భారత్-బంగ్లాల మధ్య ప్రస్తుతం దెబ్బతిన్న సంబంధాలతో ముడిపడి ఉంది. సినిమా కంటెంట్ గురించి కాదు’’ అని సోర్సెస్ వెల్లడించాయి. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ జాతిపిత అయిన ‘‘షేక్ ముజిబుర్ రెహమాన్’’ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తోంది. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు సాయపడిన అంశంతో పాటు, ముజిబుర్ రెహమాన్‌కి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు సినిమాలో ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఈ సినిమాని నిషేధం వెనక బలమైన కారణంగా ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో ఎమర్జెన్సీ సినిమాని నిషేధించారు. అయితే, అల్లు అర్జున్ పుష్ప-2 కూడా బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.