Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..

  • జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమంపై నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నించిన కంగనా రనౌత్..
  • ఈ దేశం అన్నం తింటూ పొరుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడని ఆరోపణ..
  • నక్కలా ఉండటం కన్నా కుక్కలా ఉండటం బెటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు..
Kangana

Kangana

Kangana Ranaut: ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నిస్తూ నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేశారు. నసీరుద్దీన్ షాను ‘‘నక్క’’తో పోల్చారు. దేశంలో తాను తింటున్న అన్నానికి కృతజ్ఞతగా దేశం కోసం పోరాడుతున్నానని, అయితే నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ పొరుగు దేశం కోసం పోరాడుతున్నారని ఆమె ఆరోపించారు.

‘‘నసీరుద్దీన్ షాలా నక్కలా ఉండటం కన్నా కుక్కల ఉండేందుకు నేను ఇష్టపడుతాను’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. మనుషుల్ని కుక్కతో పోల్చడం కూడా ఒక గౌరవమే అని, వాటికి విశ్వసనీయత, విధేయత అనే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. జార్ఖండ్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనలకు మద్దతు తెలిపిన పలువురు అగ్రశ్రేణి నటులు స్పందించకపోవడాన్ని పీయూష్ మిశ్రా ప్రశ్నించారు. గతంలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనపై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు నసీరుద్దీన్ షా మౌనంగా ఉండటాన్ని పీయూష్ మిశ్రా ఎత్తిచూపారు.