Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనా రనౌత్‌‌‌కి చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఘటన..

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్విందర్ కౌర్ కంగనా రనౌత్‌ని చెంపదెబ్బ కొట్టారు. రైతులను అగౌరపరిచారని ఆరోపిస్తూ కంగనాపై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గెలుపొందిన కంగనా ఢిల్లీకి వెళ్తే సమయంలో ఈ ఘటన జరిగింది.

Read Also: Kangana Ranaut: కంగనా రనౌత్‌‌‌కి చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఘటన..

కంగనా చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె UK707 విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు విమానాశ్రయంలోని బోర్డింగ్ పాయింట్‌కి వెళుతుండగా,ఆమెతో కుల్విందర్ కౌర్ వాగ్వాదానికి దిగి తనను కొట్టారని ఆరోపించారు. ఢిల్లీకి చేరుకున్న కంగనా సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులకు జరిగిన సంఘటన వివరించారు. కానిస్టేబుల్, కుల్విందర్‌ను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం CISF కమాండెంట్ కార్యాలయానికి తరలించారు.

కంగనా రనౌత్ ఇటీవల బీజేపీ పార్టీ టికెట్‌పై మండి నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కొడుకు, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్‌ని ఓడించారు. ఎన్నికల్లో గెలిచిన రెండు రోజులకే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. గతంలో రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆమె దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version