NTV Telugu Site icon

kalpana Soren: ముఖ్యమంత్రి హేమంత్ భార్య విజయం.. సంబరాల్లో కల్పన

Kalpanasoren1

Kalpanasoren1

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జేఎంఎం పార్టీ జయకేతనం ఎగరేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది. ఇక ముఖ్యమంత్రి హేమంత్ భార్య కల్పనా సోరెన్ భారీ విజయం సాధించారు. గాండే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో ఆమె కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై కల్పన విక్టరీ సాధించారు. విజయం అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. గాండే ప్రజలు తనను కూతురిలా ప్రేమించారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Koti Deepotsavam 2024 Day 15 LIVE: అయోధ్య బాలరాముని మహాభిషేకం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

జనవరి నెలాఖరున మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం హేమంత్ భార్య కల్పన పార్టీని భుజాన వేసుకుని ముందుండి నడిపించారు. దాదాపు 200 పైగా పార్టీ సభలను నిర్వహించారు. ఇక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకం అయి కలిసిపోయారు. ఓ వైపు ముఖ్యమంత్రి హేమంత్.. ఇంకోవైపు కల్పన.. ఇలా ఇద్దరు కూడా పార్టీని ముందుండి నడిపించి విజయాన్ని అందుకున్నారు.

ఇది కూడా చదవండి: Ajit Pawar: “ఈ వార్త నన్ను భయపెట్టింది.. నేను వారికి ఫోన్ చేశాను”..అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

జార్ఖండ్‌లో తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం పార్టీ 57 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ 24 స్థానాలు, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా.. 33 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్‌ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 16 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)లు ఏడు చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ ఆశించిన మేర ఫలితాలు సాధించనప్పటికీ జేఎంఎం మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది.

 

 

Show comments