Site icon NTV Telugu

karnataka: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య

Karnataka1

Karnataka1

సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు చిన్న చిన్న కారణాలకే దెబ్బతింటున్నాయి. కారణాలు ఏమైనా సరే కల కాలం కలిసి జీవించాల్సిన వాళ్లు అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pooja Hegde : శ్రీకాళహస్తిలో పూజాహెగ్డే రాహుకేతువు పూజలు

కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని జెవర్గి రోడ్డులోని ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఆ వ్యక్తి సంతోషగా గుర్తించారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు పసి బిడ్డని వెల్లడించారు. మృతదేహాలు నేలపై, మంచంపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు తెలిపారు. సంతోష మాత్రం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని చెప్పారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. అయితే ఈ మరణాలకు కారణాలేంటో ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Mahesh Goud: మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్

Exit mobile version