Site icon NTV Telugu

Arvind Kejriwal: కైలాష్ గహ్లోట్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు.. నో ప్రాబ్లమ్

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్ బీజేపీలో చేరడంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (సోమవారం) మాట్లాడుతూ.. గహ్లోట్ తన స్వంత నిర్ణయాలు తీసుకోగలరు.. అతను స్వేచ్ఛగా ఉన్నాడు.. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చని అన్నారు. ఇదిలా ఉండగా.. కైలాష్ గహ్లోట్ రాజీనామాపై ఆప్ సీనియర్ నాయకుడు దుర్గేష్ పాఠక్ మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ మంత్రిని ఈడీ, ఆదాయపు పన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా నెలలుగా ప్రశ్నిస్తున్నాయి.. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని వీడారని పేర్కొన్నారు. బీజేపీలో చేరితే.. కేసులు మొత్తం పోయి క్లీన్ చిట్ వస్తుందనే ధీమాతో కైలాష్ పార్టీ ఫిరాయించాడని పాఠక్ ఆరోపించారు.

Read Also: Pushpa -2 : ఈ సారి ఇంటర్నేషనల్ ఈవెంట్.. ఎక్కడంటే..?

అయితే, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్ ఆరోపించారు. యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామన్నారు.. కానీ, ఆ పని చేయలేకపోయింది.. బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని ఆరోపించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా ‘షీష్ మహల్’ చుట్టూ వివాదం కొనసాగడంపై కూడా ఆయన మండిపడ్డారు.

Exit mobile version