సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్‌లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు.
కాగా కచ్చా బాదమ్ పాటను సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్ చేయడానికి పలువురు వాడుతున్నారు. వీధిలో పల్లీలు విక్రయిస్తున్న సమయంలో భుబన్ బద్యాకర్ ఈ ప్రత్యేకమైన పాటను పాడటాన్ని ఎవరో రికార్డ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో బద్యాకర్ ఫేమస్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో బద్యాకర్‌కు మ్యూజిక్ కంపెనీలతో పాటు టీవీ షోల నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో అతడు ప్రమాదానికి గురికావడం తెలుసుకుని అందరూ ఆవేదన చెందుతున్నారు.
