NTV Telugu Site icon

Kollegio Neo: తక్కువ ధరకే మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ ఎంతో తెలుసా?

Kollegio Neo Scooter

Kollegio Neo Scooter

Kabira Mobility Launched Budget Price Electric Scooter Kollegio Neo: ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రలో ధరలకు చెక్ పెట్టేందుకు.. జనాలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ఒకదానికి మించి మరొక వాహనాల్ని లాంచ్ చేస్తున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు.. తక్కువ ధరల్లోనే అధునాతన ఫీచర్స్ తో స్కూటర్లను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు కబీరా మొబిలిటీ అనే కంపెనీ.. అతి తక్కువ ధరకే అదిరిపోయే స్కూటర్ ని కొలిజియో నియో పేరిట మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? ఎక్స్ షోరూమ్ ధరను ఆ కంపెనీ కేవలం రూ. 45,990గా నిర్ణయించింది. ఇక ఆన్ రోడ్ ధరను రూ. 49,200 గా కేటాయించింది. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే.. దీని డిజైన్ కూడా చాలా వినూత్నంగా, చూడముచ్చటగా ఉంటుంది.

Penalty on Google: గూగుల్‌కు షాక్‌.. ఆ భారీ జరిమానా కట్టాల్సిందే..!

తేలికగా ఉండే ఈ స్కూటర్‌కి ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఏకంగా వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇంకా ఈ స్కూటర్‌లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ ట్రాకింగ్, ఇంటెలిజెంట్ యాంటీ థెఫ్ట్ అండ్ ఎస్ఓఎస్, ట్రిప్ హిస్టరీ వంటి ఫీచర్లున్నాయి. ఏడాది వారంటీతో 48 వీ 24 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఇన్‌బిల్ట్ మొబైల్ యాప్ కలిగిన ఉన్న ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనక డ్రమ్ బ్రేక్, స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి. రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్ సౌకర్యం కూడా ఉంది. తక్కువ ధరకే స్కూటర్స్ కొనాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

Delhi Airport: ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయంలో మూత్రం