NTV Telugu Site icon

Kaali Poster: కాళీ పోస్టర్‌పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..

Kaali Poster

Kaali Poster

దర్శకురాలు లీనా మణిమేఖలై వివాదంలో చిక్కుకున్నారు. ‘కాళీ’ పేరుతో తీసిన ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే హిందూ దేవతను కించపరిచేలా ఆ పోస్టర్ ఉండడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కెనడాలోని ఆగాఖాన్‌ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాతగా నటించిన పాత్రధారి సిగరెట్‌ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌(ఎల్‌జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్‌లో కనిపిస్తోంది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలో న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన లీనా మణిమేఖలై మాత్రం తాను బతికున్నంతవరకు నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటానని అన్నారు. అందుకు జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటానన్నారు. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉన్న ఉద్దేశం అర్థమవుతుందని ఆమె అన్నారు. గతంలో లీనా మణిమేఖలై నటించిన ‘మాదతి’, ‘ఎర్రసముద్రం’ వంటి సినిమాలు ఎంతో మందిని ఆకర్షించాయి. అంతర్జాతీయంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో కూడా లీనా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

Bengaluru Crime: యువ‌తిని వేధించిన దుండ‌గుడు.. కాపాడిన హిజ్రాలు

తమిళనాడు మధురైకి చెందిన లీలా మణిమేకలై.. ‘రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలో ఉన్న అగాఖాన్‌ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ పోస్టర్‌ దేవతా మూర్తిని కించపరిచేలా ఉండడంతో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘ArrestLeenaManimekalai’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.