NTV Telugu Site icon

KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా

Ka Paul Warning

Ka Paul Warning

KA Paul Comments On Delhi Liquor Scam And BBC ED Raids: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సచివాలయాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభిస్తామని మరో మూడు రోజుల్లో ప్రకటించకపోతే.. ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ మద్దతుదారులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. దళితుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీల్ని అమలుపరచలేదని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అతిత్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ దేశ్‌కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్నారు. అసలు కేసీఆర్ దేశ్‌కి నేత కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం సభకు వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు

అలాగే.. బీబీసీపై ఐడీ రైడ్స్ చేయడానికి కారనం, గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీయడమేనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 9 ఏళ్లలో బీజేపీలో పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదని.. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో యుద్ధం చేయొద్దని మోడీకి సలహా ఇచ్చారు. మోడీ, అమిత్ షా, విదేశాంగ శాఖ.. అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మీడియాతో రాజకీయాలు చేయొద్దని, లేకపోతే ఇది దేశానికే ప్రమాదం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌ కేసులో గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్