Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..

  • CJPకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన చీఫ్ కె. అన్నామలై
  • CJP, తమ రాజకీయ అజెండాలు వేర్వేరని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉందని వెల్లడి
Annamalai

Annamalai

Annamalai: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. CJPకి తాను మద్దతు ఇచ్చినట్లు భావించొద్దని అన్నారు. ‘‘ మేం ఎప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. మా ఎజెండా వేరు’’ అని అన్నామలై స్పష్టం చేశారు. గురువారం ‘‘వీ ద లీడర్స్’ ఉద్యమం నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేపీ పద్ధతులతో ఏకీభవించకపోయినా, నిరసన తెలిపే హక్కును సమర్థిస్తు్న్నట్లు చెప్పారు.

అక్టోబర్ 10న సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలను ఆయన విమర్శించారు. దీంతో అన్నామలైపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. విమర్శలపై స్పందించిన అన్నామలై.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, దేశ ఐక్యత, సార్వభౌమత్వంపై తనకు అవగాహన ఉందని అన్నారు. దేశభక్తి గురించి ఎవరూ తనకు పాఠాలు చెప్పాల్సిన పని లేదని అన్నారు.

నిరసనకారులు తప్పు చేసి ఉంటే వారిపై చట్టప్రకరాం చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) వంటి సంస్థల ద్వారా దర్యాప్తు చేసి, ఆధారాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆధారాలు లేని అనుమానాలను ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీ మంచి పనులు చేస్తున్నారని అన్నామలై ప్రశంసించారు. అయితే, ప్రధానిని సమర్థిస్తున్న మాత్రాన ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు కనిపిస్తే ప్రశ్నించకుండా ఉండబోమని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ, సీజేపీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందా అని ప్రశ్నించారు.