K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్

Annamalai

Annamalai

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు K. Annamalai పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు Nitin Nabin అధికారికంగా ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని వారాలుగా అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్నామలై బీజేపీని వీడి కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో అన్నామలై రాజీనామా ఆమోదం పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలో కీలక భేటీలు

ఇటీవల అన్నామలై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం. పార్టీతో కొన్ని వ్యూహాత్మక అంశాలపై విభేదాలు ఉన్న నేపథ్యంలో అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

×
×
Ad

కొత్త పార్టీ దిశగా అడుగులు?

అన్నామలై త్వరలోనే కొత్త రాజకీయ వేదిక లేదా ప్రాంతీయ పార్టీని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమిళనాడులో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అన్నామలై నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన అన్నామలై

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరారు. తక్కువ కాలంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి, తమిళనాడులో బీజేపీ విస్తరణకు కీలకంగా పనిచేశారు. 2025లో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా కొనసాగారు.

తమిళనాడు రాజకీయాలపై ప్రభావం

అన్నామలై రాజీనామా తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నామలై తదుపరి పొలిటికల్ స్టెప్ ఏమిటనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.