Site icon NTV Telugu

Jyoti Maurya Case: జాబ్ రాగానే భర్తలకు షాక్.. మా భార్యలకు కోచింగ్ వద్దంటున్న భర్తలు.. ఖాన్ సార్‌కి తప్పని ఎఫెక్ట్

Khan Sir

Khan Sir

Jyoti Maurya Case: భార్యను కష్టాలు పడి చదివిస్తే మంచి జాబ్ రాగానే భర్తల్ని వదిలేసి, వేరే వాళ్లతో ఎఫైర్ పెట్టుకుంటున్నారు కొందరు మహిళలు. ఇటీవల ఇటువంటి ఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఎస్డీఎం జ్యోతి మౌర్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. తన భర్త అలోక్ మౌర్యను కాదని, గార్డ్ డిస్ట్రిక్ట్ కమాండెంట్ ఆఫీసర్ గా ఉన్న మనీష్ దూబేతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని, భర్తను వదిలేసింది. అలోక్ మౌర్య తన భార్య మోసం చేసిందని విలపించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది.

ఇదిలా ఉంటే ఎన్నో ఆశలతో ప్రభుత్వ కొలువు సాధించాలనుకుంటున్న వివాహిత మహిళలపై ఈ ప్రభావం కొంతమంది చేస్తున్న తప్పుడు పనులు నిజంగా ఏదో సాధించాలనుకుంటున్న మహిళల పాలిట శాపంగా మారింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన ‘‘ఖాన్ సార్’’కి కూడా ఈ తిప్పలు తప్పలేదు. ఆయన నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్న వివాహిత మహిళల భర్తలు వారిని కోచింగ్ మాన్పిస్తున్నారు. 93 మంది మహిళా విద్యార్థినుల భర్తలు వారిని కోచింగ్ వద్దని బలవంతం చేస్తున్నారు.

Read Also: Kashmira Shah: 14 సార్లు నా భర్తతో ట్రై చేశా.. చివరికి ఆ స్టార్ హీరో వలనే తల్లిగా మారాను

పాట్నాకు చెందిన ప్రఖ్యాత ఉపాధ్యాయుడు ఖాన్ సర్, కూడా జ్యోతి మౌర్య వివాదంలోని పరిణామాలను ఎదుర్కొంటున్నారు. అయితే సదరు మహిళల భర్తలు ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని, తమ భార్యలను ఇకపై కోచింగ్ వద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖాన్ సర్ ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని భర్తలను అభ్యర్థించినా వారు పట్టించుకోవడం లేదు. తమ భార్యలకు ఉద్యోగం అవసరం లేదని భర్తలు కరాఖండీగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో పీసీఎస్ పరీక్షలకు సిద్ధం అవుతున్న 93 మంది మహిళ ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సార్ ఎంతగా ప్రయత్నించినా ఈ విషయంలో భర్తలు ఏం వినేందుకు సిద్ధంగా లేరు. మహిళ చదువు, ఉద్యోగం వంటి అంశాలను వారివారి భర్తలకు వివరించే ప్రయత్నం చేసినా.. కూడా పెడచెవినపెట్టారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ…వ్యక్తిగత కుటుంబ విషయాలలో ఒక నిర్దిష్ట స్థాయికి మించి జోక్యం చేసుకోలేనని ఆయన చెప్పారు.

Exit mobile version