Site icon NTV Telugu

XXX vs Union of India: సుప్రీంకోర్టు పిటిషన్‌లో గుర్తింపు దాచిన జస్టిస్ వర్మ.. “XXX”గా పేరు..

Xxx Vs Union Of India

Xxx Vs Union Of India

XXX vs Union of India: జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో ఓ అగ్నిప్రమాదంలో వందల కోట్ల నగదు పట్టుబడింది. ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే, తనను తొలగించాని సిఫార్సు చేసిన విచారణ ప్యానెల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

అయితే, ఈ కేసు విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన గుర్తింపును దాచిపెట్టారు. సోమవారం సుప్రీంకోర్టు కాజ్ లిస్టు కేసును “XXX vs ది యూనియన్ ఆఫ్ ఇండియా”గా పేర్కొంది. ఇక్కడ XXX జస్టిస్ వర్మను సూచిస్తుంది. ఆయన తన పిటిషన్‌లో తన గుర్తింపును దాచిపెట్టకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాడు.

సాధారణంగా పిటిషనర్ల గుర్తింపును దాచడానికి ‘XXX’ని ఉపయోగిస్తుంటారు. లైంగిక వేధింపులు లేదా అత్యాచార బాధితులు సాధారణంగా దీనిని ఉపయోగిస్తుంటారు. మైనర్లు, మైనర్లకు సంబంధించిన కేసుల్లో వారి గుర్తింపును బహిర్గతం చేయకుండా ఉండటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

Read Also: Operation Sindoor: రావణుడు లక్ష్మణ రేఖ దాటితే లంక కాలిపోయింది.. పాకిస్తాన్‌కి కూడా అదే గతి..

నగదు పట్టుబడిన తర్వాత జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన తన పిటిషన్‌లో తన పిటిషన్‌ను అనుమతించకపోతే తాను కోలుకోలేని నష్టాన్ని, గాయాన్ని చవిచూస్తానని అన్నారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిగా, అంతర్గత విచారణ గోప్యంగా ఉండేలా చూడాలని కోరారు. పార్లమెంట్‌లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ దశలో తన గుర్తింపును ప్రజల్లో బహిర్గతం చేయడం తన గౌరవానికి, ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా తనపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని అన్నారు. ఇంటర్నల్ విచారణకు సంబంధించిన పలు విషయాలు మీడియాకు లీక్ కావడంతో తనపై వక్రీకరించిన కథనాలు ఇప్పటికే వచ్చాయని ఆయన అన్నారు.

మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నగదు దొరికింది. ఆ సమయంలో జస్టిస్ వర్మ ఆయన నివాసంలో లేరు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అంతర్గత విచారణ కమిటీ, న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలలో “తగినంత విషయం” ఉందని తేల్చింది. జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు నగదు దొరికిన గదిపై చురుకైన నియంత్రణ కలిగి ఉన్నారని తేల్చింది.

Exit mobile version