NTV Telugu Site icon

Mumbai Female Cop: ‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి

Mumbai Local Eve Teaser Fem

Mumbai Local Eve Teaser Fem

Junkie on Mumbai local eve-teases female cop at Bandra station: పోలీసులతో పెట్టుకుంటే.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి పట్ల సఖ్యతగా ఉంటే పర్లేదు కానీ, కొంచెం తేడాగా ప్రవర్తిస్తే మాత్రం.. ఇక దబిడిదిబిడే! ఈ భయంతోనే.. ఎవ్వరూ వారి జోలికి వెళ్లరు. కానీ.. ఓ ఆకతాయి మాత్రం అందుకు భిన్నంగా ఓ మహిళా పోలీస్‌ని వేధించాడు. ‘‘మేడమ్.. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’’ అంటూ టీజ్ చేశాడు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్టు వాగాడు. అయితే.. అతడు నేరుగా వేధించలేదు. ఒక ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ మమిళా పోలీస్ వీడియో తీస్తూ, ఇలా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Boora Narsaiah: తెలంగాణలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో..

ఆ ఆకతాయి ముంబై లోకల్ ట్రైన్‌లో, ఫుట్‌బోర్డు వద్ద నిల్చొని ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ సరిగ్గా బాంద్రా స్టేషన్‌కి చేరుకున్నప్పుడు.. అతగాడు తన మొబైల్ ఫోన్ బయటకు తీసి, ప్లాట్‌ఫామ్‌లో నిల్చున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో తీశాడు. ఆ వీడియో రికార్డ్ చేస్తూ.. ‘మేడమ్, నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ చెప్పాడు. ఆమెతో కంపెనీ మస్తుగా ఉంటుందంటూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వాగాడు. ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వెంటనే వైరల్ అయ్యింది. అందులో మహిళా పోలీస్‌ని టీజ్ చేయడంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో.. ఈ వీడియోపై ముంబైకి చెందిన ఎన్‌జీఓ జీవధార సంఘ్ సీరియస్ అయింది. ఈ వీడియోని ట్విటర్‌లో షేర్ చేసి.. మహారాష్ట్ర సీఎం కార్యాలయం, ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది.

IND vs AUS ODI Series: టీమిండియాకు భారీ దెబ్బ.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేమర్ దూరం!

‘‘ముంబై పోలీసులు 365 రోజుల పాటు 24 గంటలూ ప్రజలకు సేవ అందిస్తుంటారు. అలాంటి మహిళా పోలీసుల పట్ల ఓ వ్యక్తి ‘మస్తాన్ కంపెనీ’ పేరుతో వీడియో పోస్ట్ చేసి, వారిని అవమానిస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. వీరికి తగిన బుద్ధి చెప్పాలి’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఆకతాయి.. మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాము ఆ వీడియో కంటెంట్‌ని తనిఖీ చేస్తున్నామని, అనుమానుతుడ్ని ట్రాక్ చేస్తున్నామని అని బాంద్రా GRP అధికారి తెలిపారు.

Show comments