కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ డాక్టర్లంతా రోడ్లపైనే ఉన్నారు. న్యాయం కోసం గొంతెత్తున్నారు. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సూచించింది. తాజాగా వైద్యులను ఉద్దేశిస్తూ సీఎం మమతా బెనర్జీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే మీ జీవితాలు నాశనమవుతాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనలు ఆగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే మీ భవిష్యత్తు నాశనమవుతుందని.. మీరు ఎప్పటికీ విసా, పాస్‌పోర్టులు పొందలేరని మమతా వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల అరటి పండ్లు ఉన్నాయో మీకు తెలుసా..?
అయితే సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను జూనియర్ వైద్యులు ఖండించారు. తాము కేవలం న్యాయం మాత్రమే కోరుతున్నామని… తమ డిమాండ్లు నెరవేరే వరకు తిరిగి విధుల్లో చేరబోమని తేల్చి చెప్పారు.
మరోవైపు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టి 16 రోజులైనా ఇంకా న్యాయం చేయలేదని సీఎం మమతా బెనర్జీ నిలదీశారు. న్యాయమెక్కడా? అని ఆమె సీబీఐను ప్రశ్నించింది. గతంలో ఆమె బాధితురాలికి న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ కూడా చేపట్టింది. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9న వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Amaravathi: రాష్ట్రంలోని పత్తినంతా కొనుగోలు చేయాలి.. కేంద్రానికి మంత్రులు లేఖ