NTV Telugu Site icon

Law Minister Kiren Rijiju: న్యాయవ్యవస్థ ప్రజా విమర్శలకు దూరంగా ఉండాలి..

Kiren Rijiju

Kiren Rijiju

Law Minister Kiren Rijiju: భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నాయని ప్రపంచానికి తప్పుగా చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరన్ రిజిజు అన్నారు. శనివారం తూర్పు రాష్ట్రాల్లోని కేంద్ర న్యాయవాదుల సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థను ప్రశ్నించలేమని, ముఖ్యంగా న్యాయమూర్తుల విజ్ఞతను ప్రజల పరిశీలనలో ఉంచలేమని వ్యాఖ్యానించారు.

భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని చెప్పడానికి కొన్ని సార్లు దేశం లోపల, వెలుపల కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోందని అన్నారు. ఇలాంటివి ఎప్పటికీ విజయం సాధించవని స్పష్టం చేశారు. అమెరికాను అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పువచ్చు, కానీ భారతదేశం నిజంగా ‘‘ప్రజాస్వామ్యానికి తల్లి’’ అని అభివర్ణించారు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు కిరన్ రిజిజు.

Read Also: Chennai: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా ఎల్ఈడీ లైట్లతో గంజాయి సాగు..

సోషల్ మీడియాలో న్యాయమూర్తులు దుర్భాషలాడడం దురదృష్టకరమని, భారత న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొంతమందికి తెలియకపోవడం వల్లే ఇలా జరుగుతోందని రిజిజు అన్నారు. న్యాయవ్యవస్థ ఒకరకమైన విమర్శలకు గురవ్వడం మంచి సంకేతం కాదని.. న్యాయవ్యవస్థ ప్రజల విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కొంతమంది న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించేలా ఒత్తడి చేస్తున్నారని వారితోనే సమస్య ఉందని, భారత న్యాయవ్యవస్థ దీన్ని ఎప్పటికీ అంగీకరించదని రిజిజు అన్నారు.

ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ యొక్క అభిప్రాయం కొన్నిసార్లు భిన్నంగా ఉండవచ్చు, ఎందుకంటే ప్రతీఒక్కరు ఒకే విధమైన పరిశీలనను కలిగి ఉందలేరని ఆయన అన్నారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో 65 అనవసర చట్టాలను రద్దు చేయాలని ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 1,486 అనవసర చట్టాలను తొలగించామని చెప్పారు. భారతదేశాన్ని సురక్షితంగా మార్చాలని ప్రభుత్వ కోరుకుంటోందని, అందువల్ల కఠిన చట్టాలను రూపొందించాలని ఆయన అన్నారు.

Show comments