NTV Telugu Site icon

Venkaiah Naidu: న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు.. మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: ఇటీవల కాలంలో చట్టసభలు, న్యాయవ్యవస్థల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పనలో చట్టసభల ఆధిపత్యాన్ని ఆయన శనివారం సమర్థించారు. ఢిల్లీలో నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ్యాంగం కార్యనిర్వహక, శాసన సభ(పార్లమెంట్ అండ్ అసెంబ్లీలు), న్యాయవ్యవస్థకు సంబంధించిన పాత్రలను స్పష్టంగా నిర్వచించిందని, ఎవరూ కూడా తాము అత్యున్నతమని భావించి వారి పరిమితులను అధిగమించ కూడదని అన్నారు.

Read Also: Murder: జీతం వివాదంలో దారుణంగా హత్య చేసిన యజమాని.. కాన్పూర్ లో ఘటన

చట్టాలు చేసే అధికారం శాసనసభలకు మాత్రమే ఇవ్వబడ్డాయని, చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్నాయా..? లేదా..? అనే విషయాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుందని, న్యాయస్థానాలు చట్టాలు లేయలేవని అన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయదు అనేది గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చట్టసభలు చట్టాలు చేస్తాయి, కార్యనిర్వహక వ్యవస్థ అమలు చేస్తుందని, చివరకు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు. న్యాయవ్యవస్థ డైనమిక్ గా ఉండాలి, వారు వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించాలని వెంకయ్య నాయుడు అన్నారు.

పార్లమెంటు చట్టం చేసేంత వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలు, పార్లమెంట్ లో పదేపదే అంతరాయాలు ఏర్పడటంపై వెంకయ్య నాయుడు ఆదేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని, శాసనసభల్లో, పార్లమెంట్లో పేపర్లు చించేయడం, మైకులు విరగొట్టడం జరగకుండా చూడాలని ఆయన సూచించారు. సభల్లో వ్యతిరేకత, విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదని తాను చెప్పడం లేదని, వాస్తవానికి నిరసనలు, భిన్నాభిప్రాయాలు, చర్చలు ప్రజాస్వామ్యం యెక్క లక్షణాలని ఆయన తెలిపారు. కానీ గౌరవప్రదంగా, పార్లమెంటరీ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు.