JP Morgan Chase: టెక్ సంస్థల్లో అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇలా ఉద్యోగుల ఉద్వాసనకు కారణమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ దిగ్గజాలతో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా, అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ JP మోర్గాన్ చేజ్ భారీగా ఉద్యోగుల లేఆఫ్స్‌కి ప్లాన్ సిద్ధం చేసింది. 2025 అంతా ఉద్యోగుల కోతలు ఉంటాయని ప్రకటించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Vallabhaneni Vamsi: కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు వల్లభనేని వంశీ తరలింపు..
JP మోర్గాన్ చేజ్ మేనేజర్లు ఉద్యోగులకు సమాచారం ఇప్పటికే అందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో 1000 కంటే తక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ తర్వాత మార్చి మధ్యలో, మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీగా కోతలు ఉంటాయని తెలుస్తోంది. ‘‘మేము మా వ్యాపార అవసరాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తాము. దీని ప్రకారం, మా సిబ్బందిని సర్దుబాటు చేస్తాము’’ అని కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌కి పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది మా వ్యాపార సాధారణ నిర్వహణలో భాగమని, చాలా తక్కువ మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని సంస్థ చెబుతోంది. 2024 చివరి నాటికి బ్యాంకులో 317,233 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం తొలగింపులు ఉద్యోగుల్లో 0.3 శాతం ఉంటాయి.