NTV Telugu Site icon

Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..

Journalist Murder

Journalist Murder

Journalist Murder: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య సంచలనంగా మారింది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌ నుంచి 28 ఏళ్ల చంద్రకర్ మృతదేహం లభ్యమైంది. స్థానిక న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన ముఖేష్ చంద్రకర్ జనవరి 3న బీజాపూర్ జిల్లాలో శవమై కనిపించారు. జనవరి 1 రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముఖేష్, కాంట్రాక్టర్ సురేష్‌ చంద్రకర్ అవినీతిని బయటకు తెచ్చాడు. బస్తర్ జిల్లాలో రూ.120 కోట్ల రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను బయటపెట్టాడు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది.

కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్, జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్‌లు కలిసేందుకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం తర్వాత నుంచి ముఖేష్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో అడి అన్నయ్య యుకేష్ చంద్రకర్ మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. జనవరి 3న చట్టన్‌పరాలోని సురేష్ ప్రాపర్టీలో ముఖేష్ మృతదేహం దొరికింది.

Read Also: Komatireddy Rajgopal Reddy : బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘‘ జనవరి 1న, ముఖేష్ తప్పిపోయాడని బాధితుడి సోదరుడు మాకు తెలియజేశాడు. మేము చర్యలు ప్రారంభించాము. సీసీటీవీ ఫుటేజీ స్కాన్ చేశాము. అతని లాస్ట్ లొకేషన్ కనుగొన్నాము. శుక్రవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నాము’’ అని పోలీసులు తెలిపారు. సురేష్ చంద్రకర్ సోదరులు దినేష్ చంద్రకర్, రితేష్ చంద్రకర్ సహా ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. కాంట్రాక్టర్ సర్కిల్స్‌‌కి చెందిన పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జర్నలిస్ట్ హత్యను ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి విష్ణదేవ్ సాయ్ తన సంతాపాన్ని తెలిపారు. బీజాపూర్‌కి చెందిన యువకుడు, అంకితభావం కలిగిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య చాలా బాధాకరం, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వీలైనతంత త్వరగా నేరస్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన సీఎం ట్వీట్ చేశారు.

Show comments