Site icon NTV Telugu

మళ్లీ భారత్‌కు దరఖాస్తు.. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..!

Johnson and Johnson

Johnson and Johnson

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత ప్రభుత్వం కూడా వేగంగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకుంటుంది.. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్లతో ఆ గోల్‌ చేరుకోవడం కష్టమని భావించి.. విదేశీ సంస్థల వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తూ వస్తుంది.. ఇక, ఇప్పటికే సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన అమెరికాకు చెందిన జాన్సస్‌ అండ్ జాన్సన్‌… అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు కూడా ఎగమతి చేసింది.. గ‌తంలో ఈ సంస్థ ఇండియాలో ప్రయోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని తాజాగా ఉపసంహరించుకోగా.. మరోసారి అత్యవ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. గురువారం రోజు దరఖాస్తున్న చేసుకున్నట్టు జాన్సన్‌ అండ్ జాన్సన్‌ ఈరోజు వెల్లడించింది. కాగా, హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ. లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది జాన్సన్‌ అండ్ జాన్సన్.. ఈ సింగిల్‌ డోస్‌కు అనుమతి లభిస్తే.. భారత్‌లో బ‌యోలాజిక‌ల్ ఈ. లిమిటెడ్ సంస్థ సరఫరా చేయనుంది.

Exit mobile version