Boeing: బోయింగ్‌ని ముందే హెచ్చరించిన మాజీ ఉద్యోగి.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి..
- బోయింగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగా జాన్ బార్నెట్..
- ఆ తర్వాత అనుమానాస్పద మృతి..
- 787-8 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు చేసిన బార్నెట్..
- ఎయిరిండియా దుర్ఘటనలో ప్రమాదానికి గురైంది ఈ విమానమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boeing: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24మమది మెడికోలు మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
బోయింగ్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానస్పద మరణించడం, ఆయన బోయింగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం వంటివి వార్తల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. బార్నెట్ 2024లో సౌత్ కరోలినా చార్టెస్టర్ కౌంటీలోని తన ఇంట్లో మరణించారు.
Also Read
- Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
62 ఏళ్ల బార్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశారు. బోయింగ్ సంస్థలో మూడు దశాబ్ధాలకి పైగా పనిచేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత బోయింగ్‌పై అనేక ఆరోపణలు చేసి, చట్టపరమైన చర్యల్ని ప్రారంభించారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఎయిరిండియా ప్రమాదంలో కూలిపోయింది కూడా ఈ తరహా విమానమే.
బోయింగ్ గురించి సంచలన ఆరోపణలు:
2019లో బీబీసీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాడు. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయడని చెప్పారు. బోయింగ్ అత్యాధునిక 787 డ్రీమ్ లైనర్ క్యాబిన్ డికంప్రెషన్ సమయంలో ప్రయాణికులు మాస్కులు లేకుండా ఉండొచ్చనే విషయాన్ని వెల్లడించారు.
కొన్ని పరీక్షల్ని ప్రస్తావిస్తూ.. ఆక్సిజన్ వ్యవస్థల్లో నాలుగింట ఒక వంతు తప్పుగా ఉంచొచ్చని, అవసరమైన సమయాల్లో పనిచేయకపోవచ్చని బార్నెట్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్‌లపై పరీక్ష తర్వాత, 787 డ్రీమ్‌లైనర్ 25 శాతం వైఫల్యాన్ని చూపించిందని బార్నెట్ కనుగొన్నాడు. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగిందని, ఇది భద్రతపై రాజీ పడిందని ఆయన అన్నారు.
ఇదే కాకుండా కార్మికులు కర్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ప్రొడక్షన్ లైన్లో జాప్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా స్ర్కాప్ బిన్ల నుంచి తక్కువ ప్రామాణిక భాగాలను ఉపయోగించిందని, వాటిని విమానాలకు అమర్చారని అతను ఆరోపించాడు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యలేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ కొన్ని ఆందోళనల్ని సమర్థించింది.
అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది.
జాన్ బార్నెట్ అనుమానాస్పద మరణం
మార్చి 9, 2024న, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్లోని ఒక హోటల్ వెలుపల తన పికప్ ట్రక్కులో జాన్ బార్నెట్ చనిపోయి కనిపించాడు. బోయింగ్‌పై తన విజిల్‌బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతున్నప్పుడు మరణించడం సంచలనంగా మారింది.
పోలీసుల విచారణలో తలపై తుపాకీ గాయంతో ఉన్నట్లు కనుగొన్నారు. అతని కుడి చేతిలో ఒక హ్యాండ్‌గన్ ఉంది , అధికారులు తెలిపిన దాని ప్రకారం అది ఆత్మహత్య అని ఫోరెన్సిక్ ఆధారాలు నిర్ధారించాయి. వాహనంలో చేతితో రాసిన ఒక నోట్ దొరికింది, అందులో “నేను ఇకపై ఇలా చేయలేను. ఫక్ బోయింగ్. బోయింగ్ మూల్యం చెల్లించాలని నేను ప్రార్థిస్తున్నాను” అని రాసి ఉంది.
తాజావార్తలు
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
-
Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
-
Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
-
Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!