Site icon NTV Telugu

Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం

University

University

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నిర్వాకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యార్థులతో సహా విద్యావేత్తలను విభ్రాంతికి గురి చేసింది. మార్కుల మెమోలో 100 మార్కులకు గాను 123 మార్కులు వేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

జోధ్‌పురిలోని ఎంబీఎం ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 100 మార్కులకు రెండవ సెమిస్టర్ జరిగింది. అయితే మార్కుల మెమోలో 100 మార్కులకు గాను ఒకచోట 123 మార్కులు.. ఇంకొక చోట 119 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Pawan Singh: బీజేపీలో చేరిక గాయకుడు పవన్ సింగ్.. బీహార్‌లో పోటీ కోసమేనా?

విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచిన ఫలితాలను చూసి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఇలాంటి పొరపాట్లు కనిపించాయి. అయితే దీనిపై గందరగోళం నెలకొనగానే పరిపాలన విభాగం ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తొలగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం విమర్శలకు దారి తీసింది. అయితే విశ్వవిద్యాలయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని సమాచారం. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది. చాలా సార్లు సర్టిఫికెట్లు దిద్దుబాట్లు చేసిన దాఖలాలు చాలానే ఉన్నట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి

ఫలితాలను వైట్‌సైట్‌లో విడుదల చేసే ముందు చూసుకోకుండా ఎలా విడుదల చేస్తారని ఒక విద్యార్థి యూనివర్సిటీ పరిపాలన విభాగాన్ని ప్రశ్నించాడు. అంతర్గత మార్కులను అంతర్గతేతర మార్కులతో పాటు తప్పుగా అప్‌లోడ్ చేశారని ఆరోపించాడు. తప్పు పూర్తిగా పరిపాలనాపరమైనదే అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు సరిదిద్దు కోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయాడు.

జరిగిన పొరపాటును వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అజయ్ శర్మ తప్పును అంగీకరించారు. పరీక్షా సంస్థ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అంతర్గత మార్కులు 15-20 నిమిషాల పాటు అనుకోకుండా అప్‌లోడ్ అయ్యాయని పేర్కొన్నారు. లోపం గుర్తించిన వెంటనే ఫలితాలు తొలగించినట్లు చెప్పారు. బాధ్యతాయుతమైన ఏజెన్సీకి నోటీసు జారీ చేశామన్నారు.

Exit mobile version